Michael Jackson – India : మైఖేల్ జాక్సన్ కు భారత్ అంటే ఎంత ప్రేమో తెలుసా?

భారత్.. నీ ప్రేమలో పడిపోయా

భారత్.. నిన్ను చూడటానికి
ఈ జీవితమంతా వేచివున్నా..
నిన్ను, నీ ప్రజలను కలుసుకున్నా
నీ ప్రేమలో పడిపోయా..
నిన్ను విడిచి వెళ్ళిపోతున్న ఈ సమయంలో
నా గుండె వేదన, నిరాశతో నిండిపోయింది..
భారత్.. నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తానని..
నిన్ను ప్రేమతో ఆలింగనం చేసుకుంటానని
హామీ ఇస్తున్నా..
నీ దయాగుణం, ఆధ్యాత్మిక చైతన్యం
నన్ను కదిలించాయి..
నీ ప్రజలు నా హృదయాన్ని తాకారు
వాళ్ళు దేవుడి ప్రతిరూపాలు..
భారత్.. నేను నిన్ను గాఢంగా ప్రేమించా..
భారత్.. నువ్వు నా ప్రత్యేక దేశానివి..
దేవుడు నిన్ను ఎప్పుడూ దీవిస్తూ ఉండాలి..

– పాప్ రారాజు మైఖేల్ జాక్సన్

(భారత్‌ గొప్పతనం.. భారతీయుల కంటే పొరుగు వారికే బాగా అర్థమవుతుందని చాలాసార్లు అనిపిస్తుంది.. 1996లో ముంబైలో ప్రదర్శనలు ఇచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మైఖేల్ జాక్సన్ భారత్ పై తనకున్న ప్రేమాభిమానాలను ఇలా దిండుపై రాశారు )


షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply