Daily Life : రోజుకొకసారి ఇలా చేయండి..


రోజుకొక్కసారైనా
అమ్మానాన్నలకు పాదాభివందనం చేయండి –
వారే కదా మన ప్రత్యక్ష దైవాలు
రోజుకొక్కసారైనా నవ్వండి –
అది ఆత్మ పాడే పాట
రోజుకొక్కసారైనా ఆలోచించండి –
అది మనోశక్తికి ఇంధనం
రోజుకొక్కసారైనా ఎదో ఒక ఆట ఆడండి –
అది నిత్యయవ్వన రహస్యం
రోజుకొక్కసారైనా ఏదైనా చదవండి –
అది ఙ్ఞాన తేజం
రోజుకొక్కసారైనా ధ్యానం చేయండి –
అది ధరిత్రిలోకెల్ల బలీయమైన శక్తి
రోజుకొక్కసారైనా ప్రేమను వ్యక్తీకరించండి –
ప్రేమను అందుకోండి అది ప్రకృతి ఇచ్చిన కానుక
రోజుకొక్కసారైనా స్నేహితులను కలుసుకోండి –
అది సంతోషానికి రాజబాట
రోజుకొక్కసారైనా ఇతరులకు సాయపడే పనిచేయండి –
ఈ జీవితం బహు చిన్నది
రోజుకొక్కసారైనా మీ పనిని పరీక్షించుకోండి
అది మీ విజయయాత్రలో మైలురాయి
షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply