About Us

ప్రియ‌మైన పాఠ‌కుల‌కు న‌మ‌స్కారం.. ?

https://teluguspirit.com/ వెబ్ సైట్‌ని ఎంతో గొప్ప ఆశ‌యంతో ప్రారంభించాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లు, తెలుగు అభిమానులు, తెలుగు నేర్చుకునేవారికి ఇది చ‌క్క‌ని వేదిక‌గా ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నాం. స‌మాజంలో స్ఫూర్తిని నింపాల‌న్న ల‌క్ష్యంతోనే ఈ వెబ్‌సైట్‌కు తెలుగు స్పిరిట్ అని పేరు పెట్టాం. అందుకు త‌గినట్లే ముందుకు వెళ్తాం.

తెలుగు భాష‌, సాహిత్యం, భార‌తీయ సంస్కృతి, ఆధ్యాత్మిక‌త‌, జాతీయ ఆకాంక్ష‌లు, తెలుగువారి అల‌వాట్లు, అవ‌స‌రాలు, ప‌ర్యావ‌ర‌ణం, స్ఫూర్తిదాయ‌క వ్య‌క్తులు, సంస్థ‌లు, ప్ర‌య‌త్నాల‌పై క‌థ‌నాలు, క్లిష్ట స‌మ‌స్య‌లపై మేధావుల అభిప్రాయాలు, సామాజిక రుగ్మ‌త‌ల నిర్మూల‌న‌, పేద‌లు, రైతుల‌కు చేయూత అందించ‌టం ఇలా అనేక అంశాలకు వేదిక‌గా ఈ వెబ్‌సైట్ ఉంటుంది.

రోజువారీ రాజకీయాలు, ఎవ‌రికీ ఉప‌యోగం లేని సాధార‌ణ ప‌రిమాణాలపై క‌థ‌నాలు ఇస్తూ పాఠ‌కుల స‌మ‌యాన్ని, వెబ్‌సైట్‌ను వృథా చేసే ఉద్దేశం మాకు ఎంత‌మాత్రం లేదు. ఎక్కువ మందిని ఆక‌ట్టుకోవ‌టం కోసం సినిమా హీరోయిన్లు, మహిళ‌ల గురించి జుపుస్సాక‌ర‌మైన, అనైతిక‌మైన క‌థ‌నాలు ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌బ్లిష్ చేయ‌మ‌ని హామీ ఇస్తున్నాం.

మాతో ఏకీభ‌వించే, మాలాంటి ఆశ‌యాల‌తోనే ముందుకు వెళ్తున్న‌వారు చేతులు క‌ల‌పొచ్చు. రండి.. గొప్ప స‌మాజాన్ని నిర్మిద్దాం.