Postal Accident Policy : తపాలా శాఖలో గొప్ప బీమా పథకం !

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank) చాలా తక్కువ ప్రీమియంతోనే రూ. 10 లక్షల కవరేజ్‌ ఇచ్చే గొప్ప బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆపద సమయంలో వైద్య ఖర్చులు భరించటంతో పాటు పిల్లల చదువు ఫీజులు అందిస్తుంది. పేరు గ్రూప్‌ ఆక్సిడెంట్‌ గార్డ్‌ (Group Accident Guard). టాటా ఏఐజీ (TATA AIG)తో ఒప్పందం చేసుకుని దీన్ని అమలు చేస్తోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా ఉన్న వాళ్లందరూ ఇందుకు అర్హులు.

చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాల వాళ్లు బీమా పథకాల ఆవశ్యకత గుర్తించటం లేదు. ప్రీమియం ఎక్కువగా ఉండటంతో బీమా చేసుకునేందుకు ముందుకు రావటం లేదు. ఇండియా పోస్ట్ పేమెంట్‌ బ్యాంకు తీసుకొచ్చిన పథకంతో సామాన్యులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. సామాన్యులే కాదు అందరూ తీసుకోవాల్సిన పథకమిది. నిత్యం రోడ్డు ప్రమాదాలు, ప్రమాద మరణాలు సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గ్రూప్‌ ఆక్సిడెంట్‌ గార్డ్‌ పాలసీని తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇండియా పోస్ట్ పేమెంట్‌ బ్యాంకులో ఖాతా లేనివాళ్లు ఇందుకోసం తెరవడం ఉత్తమం. ఆత్మహత్య, సైనిక ఆపరేషన్లు, యుద్ధం, చట్ట వ్యతిరేక చర్య, ఇన్‌ఫెక్షన్లు, ఎయిడ్స్, ప్రమాదకరమైన ఆటల కారణంగా మరణించినా, ప్రమాదానికి గురైనా బీమా వర్తించదు.

గ్రూప్‌ ఆక్సిడెంట్‌ గార్డ్‌ ప్రీమియం ఆప్షన్‌

వయో అర్హత 18 – 65 ఏళ్లు
చెల్లించాల్సిన ప్రీమియం రూ. 399
బీమా కాలపరిమితి ఏడాది
ప్రమాద మరణం – పరిహారం రూ.10,00,000
శాశ్వత పూర్తిస్థాయి అంగ వైకల్యం – పరిహారం రూ.10,00,000
శాశ్వత పాక్షిక అంగవైకల్యం – పరిహారం రూ.10,00,000
ప్రమాదంలో శరీర భాగాలు కోల్పోవటం, పక్షవాతం – పరిహారం రూ.10,00,000
ప్రమాదం – వైద్య ఖర్చులు (IPD) గరిష్ఠంగా.. రూ. 60,000
ప్రమాదం – వైద్య ఖర్చులు (OPD) గరిష్ఠంగా.. రూ. 60,000
ఇద్దరు పిల్లల చదువు ఫీజులు గరిష్ఠంగా.. రూ. 1,00,000
రోజు వారీ ఆసుపత్రి ఖర్చు – క్యాష్‌బ్యాక్‌ (10 రోజుల పాటు) రూ. 1,000
కుటుంబ సభ్యుల రవాణా ఖర్చులు గరిష్ఠంగా.. రూ. 25,000
మరణిస్తే అంతిమ సంస్కారాల ఖర్చు రూ. 5,000

గ్రూప్‌ ఆక్సిడెంట్‌ గార్డ్‌ బేసిక్‌ ఆప్షన్‌

వయో అర్హత 18 – 65 ఏళ్లు
చెల్లించాల్సిన ప్రీమియం రూ. 299
బీమా కాలపరిమితి ఏడాది
ప్రమాద మరణం – పరిహారం రూ.10,00,000
శాశ్వత పూర్తిస్థాయి అంగ వైకల్యం – పరిహారం రూ.10,00,000
శాశ్వత పాక్షిక అంగవైకల్యం – పరిహారం రూ.10,00,000
ప్రమాదంలో శరీర భాగాలు కోల్పోవటం, పక్షవాతం – పరిహారం రూ.10,00,000
ప్రమాదం – వైద్య ఖర్చులు (IPD) గరిష్ఠంగా.. రూ. 60,000
ప్రమాదం – వైద్య ఖర్చులు (OPD) గరిష్ఠంగా.. రూ. 60,000

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply