Emergency Bulbs : ఇన్వ‌ర్ట‌ర్ బ‌ల్బులు వాడితే క‌రెంటు కోత‌ల టెన్షనే ఉండ‌దు..

వ‌ర్షాలు, సాంకేతిక స‌మ‌స్య‌లు, రోడ్ల వెంట జ‌రిగే అభివృద్ధి ప‌నులు, విద్యుత్తు శాఖ చేప‌ట్టే మ‌ర‌మ్మ‌తులు.. ఇలా కార‌ణాలు ఏవైనా త‌ర‌చూ క‌రెంటు పోతుంటే ఇబ్బందిగా ఉంటుంది. రాత్ర‌యితే మ‌రీ చికాకుగా ఉంటుంది. ఏ ప‌నీ చేసుకోలేము. ఖాళీగా కూర్చోవాల్సిన ప‌రిస్థితి. ఇంట్లో మ‌హిళ‌లు ఒంట‌రిగా ఉంటే టెన్ష‌న్ ప‌డ‌తారు. చిన్న‌ పిల్ల‌లు ఉంటే భ‌య‌ప‌డ‌తారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు అయితే హోంవర్క్ చేసుకోలేరు. చ‌దువుకోలేరు. వివిధ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది. వారి స‌మ‌యం చాలా వృథా అవుతుంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం రూ. 20వేలు వెచ్చించి ఇంట్లో ఇన్వ‌ర్ట‌ర్ ఏర్పాటు చేసుకోవ‌టమే. కానీ అంద‌రికీ అంత స్థోమ‌త ఉండ‌దు. అలాంటి వారి కోసం మరో ప‌రిష్కారం కూడా ఉంది. అదే ఇన్వర్ట‌ర్ బ‌ల్బ్స్ / రీఛార్జేబుల్‌ ఎమ‌ర్జెన్సీ ఎల్ ఈడీ బ‌ల్బ్స్ ఏర్పాటు చేసుకోవ‌టం.

ఎలా ప‌నిచేస్తాయి..?

క‌రెంటు ఉన్నంతు సేపు ఇన్వ‌ర్ట‌ర్ బ‌ల్బ్ వెలుగుతూనే ఛార్జింగ్ అవుతుంది. క‌రెంటు పోతే వెంట‌నే ఛార్జింగ్‌తో బల్బ్ దానిక‌దే వెలుగుతుంది. నాలుగు గంట‌ల పాటు వెలుగుతూనే ఉంటుంది. ప్ర‌స్తుతం ఎక్క‌డా అంత స‌మ‌యం దాదాపుగా క‌రెంటు పోవ‌టం లేదు. క‌రెంటు రాగానే మామూలు ప‌ద్ధ‌తిలో బ‌ల్బ్ వెలుగుతూనే, ఛార్జింగ్ అవుతుంది. ఇవి ఇంట్లో, బ‌య‌ట, దుకాణం, ఆఫీస్‌, పొలం, ప‌ని ప్ర‌దేశం వ‌ద్ద ఇలా ఎక్క‌డ‌యినా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఇంట్లోని అన్ని గ‌దుల్లో ఏర్పాటు చేసుకుంటే క‌రెంటు ఉంటుందా.. పోతుందా అన్న ఆందోళ‌నే అవ‌స‌రం ఉండ‌దు. క‌రెంటు లేదు అన్న భావ‌నే ఉండ‌దు.

కంపెనీలు – ధ‌ర‌లు..

ఇన్వ‌ర్ట‌ర్ బ‌ల్బ్స్ ఆన్‌లైన్ స్టోర్స్ తో పాటు మార్కెట్‌లో త‌క్కువ ధ‌రలోనే దొరుకుతున్నాయి. విప్రో, ఎకోలింక్‌, ఫిలిప్స్, హ‌లోనిక్స్, సిస్కా, స‌న్‌కింగ్, ఎవ్రీడే ఇలా చాలా కంపెనీలు రీఛార్జేబుల్‌ ఎమర్జెన్సీ ఎల్ఈడీ బ‌ల్బ్స్ త‌యారు చేస్తున్నాయి. ఫిలిప్స్ వంటి కొన్ని కంపెనీలు రీఛార్జేబుల్ ఎమర్జెన్సీ ఎల్ఈడీ ట్యూబ్స్ కూడా త‌యారు చేస్తున్నాయి. ఈ బ‌ల్బ్స్ ధ‌లు రూ. 380 నుంచి ఉంటున్నాయి. ఒక్కో కంపెనీ ధ‌ర‌లు ఒక్కో విధంగా ఉంటున్నాయి. మంచి కంపెనీ బల్బులను ఎంచుకోవటం బెట‌ర్. 8 వాట్స్ నుంచి వివిధ స్థాయిల్లో బల్బులు దొరుకుతాయి. ఆన్‌లైన్‌లో ఎక్కువ బల్బ్స్ తీసుకుంటే త‌క్కువ ధ‌ర‌లో వ‌స్తాయి.

ఏడాది పాటు వారంటీ..

ఏ కంపెనీ బల్బ్ అయినా ఏడాది పాటు వారంటీ ఇస్తారు. ఏడాదిలోగా ప‌నిచేయ‌క‌పోతే మళ్ళీ కొత్త‌వి ఇస్తారు. సిస్కా కంపెనీ మ‌రింత అడ్వాన్స్ గా బల్బులను త‌యారు చేస్తోంది. ఈ కంపెనీ ఇన్వ‌ర్ట‌ర్ బ‌ల్బ్ వారంటీ తీరాక ప‌నిచేయ‌కుండా పోయినా ప‌డేయాల్సిన అవ‌స‌రం లేదు. బల్బ్‌లోని ఛార్జింగ్ బ్యాట‌రీల‌ను తీసి కొత్త‌వి ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు సిస్కా ఇన్వ‌ర్ట‌ర్ బ‌ల్బుల్లో ఉంది. ఆమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ స్టోర్ల లో మీకు అనువైనవి ఎంచుకుని కొనుక్కోండి.

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply