PIN-code-numbers-in-India

Pin Code : పిన్ కోడ్‌లో ఏం వివ‌రాలు ఉంటాయో తెలుసా?

త‌పాలా శాఖ ద్వారా లేఖ‌లు పంపించ‌టం దాదాపు ఆగిపోయినా పిన్‌కోడ్ వినియోగం ఆగ‌లేదు. ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసే వ‌స్తువులు రావ‌డానికి, కొరియ‌ర్ ద్వ‌రా పార్సిళ్లు పంపించ‌డానికి ఇప్ప‌టికీ పిన్‌కోడే ఆధారం అవుతోంది. పిన్(PIN) అంటే Postal Index Number. విదేశాల్లో ZIP కోడ్ అని పిలుస్తుంటారు. ఆరు అంకెల్లో ఉండే పిన్ నంబ‌రులో ఒక్కో నంబ‌రు ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ వివ‌రాలు తెలుసుకుంటే పిన్ కోడ్ నంబ‌రు ద్వారా వ్య‌క్తులు, సంస్థ‌ల చిరునామా ఎక్క‌డ ఉందో స్ప‌ష్టంగా తెలుసుకోవ‌చ్చు. ఆ వివ‌రాలు ఇవీ..

  • పిన్ కోడ్‌లోని మొద‌టి నంబ‌రు
    ఇది దేశంలోని ప్రాంతాన్ని సూచిస్తుంది. 8 నంబర్లు భౌగోళిక ప్రాంతాల‌ను సూచిస్తే 9వ నంబ‌రు సైన్యానికే ప్ర‌త్యేకంగా కేటాయించారు.
    ఉత్తర భార‌త ప్రాంతం (Northern India) – 1, 2
    పశ్చిమ భార‌త ప్రాంతం (Western India) – 3, 4
    ద‌క్షిణ భార‌త ప్రాంతం (Southern India) 5, 6
    తూర్పు భార‌త ప్రాంతం (Eastern India) 7, 8
    ఆర్మీ పోస్ట‌ల్ స‌ర్వీస్ ( Army Postal Service) 9

  • పిన్ కోడ్‌లోని రెండో నంబ‌రు
    రెండో అంకె ఉప ప్రాంతం(Sub Region) సూచిస్తుంది. మొద‌టి, రెండో అంకెల‌ను క‌లిపి చూస్తే ఏ రాష్ట్రమో చెప్ప‌వ‌చ్చు.

11 – దిల్లీ

12 – హ‌ర్యానా
13 – హ‌ర్యానా

14 – పంజాబ్
15 – పంజాబ్
16 – పంజాబ్

17- హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌

18 – జ‌మ్ము & క‌శ్మీర్
19 – జ‌మ్ము & క‌శ్మీర్

20 – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్
21 – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్
22 – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్
23- – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్
24 – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్
25 – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్
26 – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్
27 – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్
28 – ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ & ఉత్త‌రాంచ‌ల్

30 – గుజ‌రాత్
31 – గుజ‌రాత్
32 – గుజ‌రాత్
33 – గుజ‌రాత్
34 – గుజ‌రాత్
35 – గుజ‌రాత్
36 – గుజ‌రాత్
37 – గుజ‌రాత్
38 – గుజ‌రాత్
39 – గుజ‌రాత్

40 – మ‌హారాష్ట్ర
41 – మ‌హారాష్ట్ర
42 – మ‌హారాష్ట్ర
43 – మ‌హారాష్ట్ర
44 – మ‌హారాష్ట్ర

45 – మధ్య‌ప్ర‌దేశ్ & ఛ‌త్తీస్ గ‌ఢ్
46 – మధ్య‌ప్ర‌దేశ్ & ఛ‌త్తీస్ గ‌ఢ్
47 – మధ్య‌ప్ర‌దేశ్ & ఛ‌త్తీస్ గ‌ఢ్
48 – మధ్య‌ప్ర‌దేశ్ & ఛ‌త్తీస్ గ‌ఢ్
49 – మధ్య‌ప్ర‌దేశ్ & ఛ‌త్తీస్ గ‌ఢ్

50 ‍‍‍‍- ఆంధ్ర‌ప్ర‌దేశ్ & తెలంగాణ‌
51 – ఆంధ్ర‌ప్ర‌దేశ్ & తెలంగాణ‌
52 – ఆంధ్ర‌ప్ర‌దేశ్ & తెలంగాణ‌
53 – ఆంధ్ర‌ప్ర‌దేశ్ & తెలంగాణ‌

56 – క‌ర్ణాట‌క‌
57 – క‌ర్ణాట‌క‌
58 – క‌ర్ణాట‌క‌
59 – క‌ర్ణాట‌క‌

60 – త‌మిళ‌నాడు
61 – త‌మిళ‌నాడు
62 – త‌మిళ‌నాడు
63 – త‌మిళ‌నాడు
64 – త‌మిళ‌నాడు

67 – కేర‌ళ‌
68 – కేర‌ళ‌
69 – కేర‌ళ‌

70 – ప‌శ్చిమ బెంగాల్
71 – ప‌శ్చిమ బెంగాల్
72 – ప‌శ్చిమ బెంగాల్
73 – ప‌శ్చిమ బెంగాల్
74 – ప‌శ్చిమ బెంగాల్

75 – ఒడిశా
76 – ఒడిశా
77 – ఒడిశా

78 – అస్సాం

79 – ఈశాన్య రాష్ర్టాలు

80 – బిహార్ & జార్ఖండ్
81 – బిహార్ & జార్ఖండ్
82 – బిహార్ & జార్ఖండ్
83 – బిహార్ & జార్ఖండ్
84 – బిహార్ & జార్ఖండ్
85 – బిహార్ & జార్ఖండ్

90 – 99 ఆర్మీ పోస్ట‌ల్ స‌ర్వీస్(APS)

  • పిన్ కోడ్‌లోని మిగ‌తా నంబ‌ర్లు
    పిన్ కోడ్‌లోని మూడో అంకె జిల్లాను సూచిస్తుంది. పిన్ కోడ్‌లోని చివ‌రి మూడు అంకెలు పోస్టాఫీసును సూచిస్తాయి.
షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply