details-of-pan-card

PAN CARD : పాన్ కార్డు నంబ‌రులో ఏ వివ‌రాలు ఉంటాయో తెలుసా?

ఆధార్, ఓటరు కార్డు తర్వాత ఎక్కువ మంది వాడుతున్నది పాన్ కార్డ్(PAN card). బ్యాంకు ఖాతాదారుల‌ను కూడా ఈ కార్డు వివ‌రాలు త‌ప్ప‌నిస‌రిగా అడుగుతున్నారు. అందుకే ఉద్యోగులు, ప్రొఫెష‌న‌ల్స్ అయిన పన్ను చెల్లింపుదారులే కాదు.. నిర‌క్ష‌రాస్యులు కూడా పాన్ కార్డు తీసుకుంటున్నారు. ఇందులో 10 ఆంగ్ల అక్షరాలు, నంబర్లు కలిపి పాన్ నంబర్(permanent account number) ఉంటుంది. ఈ అక్ష‌రాలు, అంకెల ఆధారంగా కార్డు హోల్డ‌రుకు సంబంధించిన కొన్ని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. చాలామందికి ఈ వివ‌రాలు తెలియ‌వు. ఆవెంటో ఓసారి చూడండి.

  • మొద‌టి మూడు ఆంగ్ల అక్ష‌రాలు పాన్‌కార్డు సిరీస్‌ను చూపిస్తాయి.
    ఇందులో AAA నుంచి ZZZ వ‌ర‌కు ఏవైనా మూడు అక్ష‌రాలు ఉండొచ్చు.
  • నాలుగో అక్ష‌రం – పాన్‌కార్డు హోల్డ‌ర్ స్టేట‌స్‌ను తెలియ‌జేస్తుంది.
    P ఉంటే వ్య‌క్తిగ‌త (Individual) కార్డు
    C ఉంటే కంపెనీ (Company) కార్డు
    H హిందూ అవిభాగ్య కుటుంబం (Hindu Undivided Family – HUF)
    A అసోసియేష‌న్ ఆఫ్ ప‌ర్స‌న్స్ (Associaltion of Persons – AOP )
    B బాడీ ఆఫ్ ఇండివిజువ‌ల్ (Body of Individuals)
    G గ‌వ‌ర్న‌మెంట్ ఏజెన్సీ (Goverment Agency)
    J అర్టిఫిషియ‌ల్ జురిడిక‌ల్ ప‌ర్స‌న్(Artificial Juridiacal Person)
    L స్థానిక సంస్థ (Local Authority)
    F ఫ‌ర్మ్ / లిమిటెడ్ లయ‌బ‌లిలిటీ పార్ట్ న‌ర్‌షిప్ (Firm / Limited Liability Partnership)
    T ట్ర‌స్ట్ – స్వ‌చ్ఛంద సంస్థ‌ (Trust)
  • అయిదో అక్ష‌రం వ్య‌క్తిగ‌త‌ కార్డు హోల్డ‌ర్ పేరు (పేరు/ఇంటిపేరు)లోని మొద‌టి అక్ష‌రం ఉంటుంది.
    వ్య‌క్తిగ‌త కార్డు కాక‌పోతే కార్డు హోల్డ‌ర్ పేరులోని మొదటి అక్ష‌రం ఉంటుంది.
  • 6 నుంచి 9వ అక్ష‌రం(అంకె) వ‌ర‌కు (నాలుగు) : మొద‌టి మూడు అక్ష‌రాల లాగే ఈ నాలుగు అంకెలు సిరీస్‌కు సంబంధించిన‌వి. ఇవి 0001 నుంచి 9999 వ‌ర‌కు నంబ‌ర్ల‌లో ఏవైనా ఉంటాయి.
  • చివ‌రి అక్ష‌రం(పాన్ నంబ‌రులోని ప‌దో అక్ష‌రం) అల్ఫాబెటిక్ చెక్ డిజిట్(Alphabetic Check Digit) ఉంటుంది.
    మొద‌టి తొమ్మిది డిజిట్స్ కి ఫార్ములా అప్లై చేసి చివ‌రి డిజ‌ట్‌ను కంప్యూట‌ర్ జ‌న‌రేట్ చేస్తుంది.
షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply