TSRTC-STUDENT-BUS-PASS

Student Bus Passes : విద్యార్థుల‌కు అందించే రాయితీ బ‌స్ పాసులివే..

తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని విద్యార్థులు ప‌ట్ణణాలు, పొరుగు గ్రామాల్లోని పాఠ‌శాల‌ల‌కు వెళ్లేందుకు ఉచితంగా బ‌స్సు పాసులు అందిస్తూ అండ‌గా నిలుస్తోంది.  తెలంగాణ‌లో ఇప్ప‌టికీ చాలా ప‌ల్లెల విద్యార్థుల‌కు ఉన్న‌త పాఠ‌శాల‌లు అందుబాటులో లేవు. మెరుగైన విద్య స్థానికంగా దొర‌క‌టం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పొరుగు గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌కు విద్యార్థులు వెళ్ల‌టం త‌ప్ప‌నిస‌రిగా మారింది. చాలామంది విద్యార్థులు కి.మీ.ల కొల‌ది న‌డుస్తూ పాఠ‌శాల‌ల‌కు చేరుతుంటారు. దీనివ‌ల్ల పాఠ‌శాలకు చేరేలోపే అల‌సిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థంగా మారుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో విద్యార్థుల‌కు ఉచిత బ‌స్ పాసుల‌ను అందిస్తూ ఆర్టీసీ అండ‌గా నిలుస్తోంది.  ఈ పాసుల‌న్నీ రోజులో ఒకసారి విద్యాసంస్థ‌కు వెళ్ల‌డానికి, స్వ‌స్థ‌లానికి తిరిగి రావ‌డానికి మాత్ర‌మే వినియోగించుకోవాలి.  ఏ పాస్ అయినా   https://online.tsrtcpass.in/ వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుని పొందొచ్చు. వాటి వివ‌రాలు ఇవీ..

12 ఏళ్ల‌లోపు విద్యార్థుల‌కు ఉచిత ప్ర‌యాణం

  • పాఠ‌శాల ప‌నిదినాల్లో ఊరి నుంచి బ‌డికి వెళ్ల‌టానికి, రావ‌డానికి ఉచిత ప్ర‌యాణం. 
  • హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో అయితే సిటీ ఆర్డీన‌రీ బ‌స్సుల్లో 22 కి.మీ. వ‌ర‌కు ఉచిత ప్ర‌యాణం
  • జిల్లాల్లో అయితే ప‌ల్లె వెలుగు బ‌స్సుల్లో  20 కి.మీ.ల వ‌ర‌కు దూరం ఉన్న పాఠ‌శాల‌ల‌కు ఉచితంగా వెళ్లొచ్చు. 
  • బ‌స్ పాస్ కౌంట‌ర్ల‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే బ‌స్ పాస్ జారీ చేస్తారు.  
  • బ‌స్ పాస్ ఒక విద్యాసంవ‌త్స‌రం పాటు ప‌నిచేస్తుంది.  

18 ఏళ్ల‌లోపు ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌లకు ఉచిత ప్ర‌యాణం 

  • 18 ఏళ్ల‌లోపు లేదా ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థినుల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ఉంది. 
  •  హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో అయితే సిటీ ఆర్డీన‌రీ బస్సుల్లో 22 కి.మీ. వ‌ర‌కు ఉచిత ప్ర‌యాణం
  • జిల్లాల్లో అయితే ప‌ల్లె వెలుగు బ‌స్సుల్లో  20 కి.మీ.ల వ‌ర‌కు దూరం ఉన్న పాఠ‌శాల‌ల‌కు ఉచితంగా వెళ్లొచ్చు. 
  • బ‌స్ పాస్ కౌంట‌ర్ల‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే బ‌స్ పాస్ జారీ చేస్తారు.  
  • బ‌స్ పాస్ ఒక విద్యా సంవ‌త్స‌రం పాటు ప‌నిచేస్తుంది.  

12 ఏళ్లు దాటిన ప‌ట్ట‌ణ ప్రాంత‌ బాలుర రాయితీ బ‌స్ పాస్

  • 12 ఏళ్లు నిండిన విద్యార్థుల‌(బాలురు)కు ఉచిత బ‌స్ పాస్ ఉండదు.
  • వారు డ‌బ్బులు చెల్లించి బ‌స్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. 
  • 4, 8, 12, 18, 22 కి.మీ. ప్ర‌య‌ణానికి బ‌స్‌పాస్ తీసుకోవచ్చు. 
దూరం        బ‌స్ పాస్ ధ‌ర‌
04 కి.మీ.    రూ.450.00 
08 కి.మీ.   రూ.600.00 
12 కి.మీ.  రూ.900.00
18 కి.మీ.  రూ.1,150.00
22 కి.మీ.   రూ.1,350.00

12 ఏళ్లు దాటిన గ్రామీణ ప్రాంత‌ బాలుర రాయితీ బ‌స్ పాస్

  • 12 ఏళ్లు దాటిన విద్యార్థులు అర్హులు 
  • నెల‌కు, మూడు నెల‌ల‌కు పాస్ తీసుకోవ‌చ్చు. 
  •  5, 10, 15, 20, 25, 30, 35 కి.మీ. ల ప్ర‌య‌ణానికి బ‌స్‌పాస్ తీసుకోవచ్చు. 

దూరం         
 నెల‌ బ‌స్ పాస్ ధ‌ర‌లు  మూడు నెల‌ల‌ బ‌స్ పాస్ ధ‌ర‌లు 
05 కి.మీ.    రూ.150              రూ.400 
10 కి.మీ.    రూ.250        రూ.680
15 కి.మీ. రూ.300       రూ.900
20 కి.మీ.       రూ.400 రూ.1,150
25 కి.మీ.      రూ.450    రూ. 1,350  
30 కి.మీ.          రూ.500 రూ.1,500
35 కి.మీ.   రూ.550   రూ.1,600 
షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply