NMMS : పేద విద్యార్థులకు వరం.. ఎన్‌ఎన్‌ఎంఎస్‌ (ఉపకార వేతనం)!

ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP SCHEME – NMMS) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఉపకార వేతనం(SCHOLARSHIP)కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 1,000 చొప్పున ఏటా రూ. 12వేల ఆర్థిక సాయం అందుతుంది.  9, 10వ తరగతులు, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరాల్లో కలిపి రూ.48 వేల సాయం అందుతుంది.  ఇలా ఏటా 1,00,000 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకునే అవకాశముంది. కానీ చాలా మంది విద్యార్థులు ఈ పథకం గురించి తెలియక సద్వినియోగం చేసుకోవటం లేదు. ఉపాధ్యాయులే చొరవ చూపి దరఖాస్తు చేయించటంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించిన పాఠశాలల విద్యార్థులే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. తమ బంగారు భవిష్యత్తుకు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకంపై మరింత చైతన్యం రావాల్సిన అవసరముంది. అందరూ కృషిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది.  

పరీక్ష విధానం ఇలా.. 

ఎంఎస్‌కు ఎంపిక చేసేందుకు విద్యాశాఖ ఏటా పరీక్ష నిర్వహిస్తుంది.  పరీక్ష 90 నిమిషాల పాటు ఉంటుంది. 

ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(MAT) కాగా రెండోది స్కాలస్టిక్‌ అటిట్యూడ్‌ టెస్ట్(SAT).  

మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(MAT)లో రీజనింగ్‌, క్రిటికల్‌ థింకింగ్‌ సామర్థ్యాలను గుర్తించేలా 90 మల్టీపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 

analogy, classification, numerical series, pattern perception, hidden figure  రూపంలో  ప్రశ్నలుంటాయి.

స్కాలస్టిక్‌ అటిట్యూడ్‌ టెస్ట్(SAT)లో విఙ్ఞానశాస్ర్తం,  సాంఘికశాస్ర్తం, గణితం సబ్జెక్టుల నుంచి 90 మల్టీపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 

ఎవరు అర్హులు  

7వ తరగతిలో 55 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 50 శాతం సాధించినా పరీక్ష రాయొచ్చు.

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని రెగ్యులర్‌ విద్యార్థులే అర్హులు.

తల్లిదండ్రుల  వార్షిక  ఆదాయం రూ.1,50,000 దాటని వారే అర్హులు.

పరీక్ష ఫీజుగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన విద్యార్థులు రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది.

ఎవరు ఎంపికవుతారు?

MAT, SAT పరీక్షల్లో కనీసం 40 శాతం మార్కులతో పాస్‌ కావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 32 శాతం మార్కులు సరిపోతాయి. 

8వ తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మినహాయింపు ఉంటుంది. 

ఎంపికయ్యాక ఏం చేయాలి?

1. ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికైన విద్యార్థులు ఇతర ఉపకార వేతనాలు వదులుకోవాల్సి ఉంటుంది. 

2. విద్యార్థి తన పేరుతో ఏదైనా పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకలో ఖాతా తీసుకోవాలి. ఎస్‌బీఐలో అయితే మరీ మంచిది.

3. విద్యార్థులు 9వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులయితేనే పదో తరగతికి ఉపకార వేతనం అందుతుంది. 

4. 10వ తరగతి కనీసం 60 మార్కులతో ఉత్తీర్ణులు అయితేనే ఇంటర్‌లో ఎన్‌ఎంఎంస్‌ ఉపకార వేతనం అందుతుంది. 

5. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 

6. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మార్కుల్లో 5 శాతం మినహాయింపు ఉంటుంది. 

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply