God’s Creation : దేవుడి సృష్టిలో వివక్ష ఉందా..?

బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే !
Brahmam Okate | Dance cover |  Annamacharya Krithi
Credit: https://www.youtube.com/watch?v=vkZb8HA4UHU

ప|| తందనాన ఆహి తందనాన పురె |
తందనాన భళా తందనాన ||

చ|| బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే |
పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||

చ|| కందువగు హీనాధికము లిందు లేవు |
అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకులమింతా నొకటే |
అందరికి శ్రీహరే అంతరాత్మ ||

చ|| నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే |
అండనే బంటునిద్ర అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే |
చండాలు డుండేటి సరిభూమి యొకటే ||

చ|| అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే |
ఘనకీట పశువులకు కామ సుఖమొకటే |
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే |
వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||

చ|| కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే |
తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే |
పరగ దుర్గంధములపై వాయువొకటే |
వరుస బరిమళముపై వాయువొకటే ||

చ|| కడగి యేనుగు మీద గాయు యెండొకటే |
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ |
జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||

– తాళ్ల‌పాక అన్న‌మాచార్యులు

సృష్టిలో వివ‌క్ష ఉండ‌దు. గాలి, నీరు, భూమి, కాలం, వెలుగు, చీక‌టి, నిద్ర‌, ఆకలి, నీడ‌ ఇలా చూస్తే తార‌త‌మ్యం క‌నిపించ‌దు. అవి అంద‌రికీ ఒక‌టే. కులం, మ‌తం, చిన్నా, పెద్ద‌, అల్పు‌డు, గొప్ప‌వాడు, ధ‌న‌వంతుతు, పేద‌వాడు ఇవేవీ పుట్ట‌క‌తో రావు. ఎవ‌రూ కులం, మ‌తం రాసిపెట్టుకుని, ఆస్తుల‌ను చేత‌ప‌ట్ట‌కుని పుట్ట‌రు. అన్నీ మ‌నం సృష్టించుకున్న‌వే. అందుకే తాళ్ల‌పాక అన్న‌మ‌య్య బ్రహ్మ‌మొక్క‌టే.. ప‌ర‌బ్ర‌హ్మ‌మొక్క‌టే అని ఎలుగెత్తి చాటారు. ఇది గ్ర‌హించ‌నంత‌కాలం.. దేవుడిని, సృష్టిని అర్థం చేసుకోలేం.

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply