
అసంఘటిత రంగంలోని కార్మికుల(Unorganised Workers / Labours)కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అందుబాటులోకి తెచ్చేలా ఇ-శ్రమ్ పోర్టల్(E-Shram Portal)ను రూపొందించారు. భవన నిర్మాణ కార్మికులు, ఇళ్లల్లో పనివారు, వలస కూలీలు, వ్యవసాయ కూలీలు తదితర అన్ని రకాల కష్టజీవులు ఈ పోర్టల్‌లో ఆధార్, బ్యాంకు ఖాతా, చరవాణి నంబర్లు తదితరాలతో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న వారికి ఇ – శ్రమ్ కార్డు(E-Shram Card)లు జారీ చేస్తారు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీసేవ, కార్మిక శాఖ కార్యాలయాల్లోనూ నమోదు చేసుకోవచ్చు.
నమోదుకు ఏమేమి అవసరం
- ఆధార్ నంబర్ (Aadhar Card)
- ఆధార్ అనుసంధానమైన (లింక్ అయిన) ఫోన్ నంబర్ (Mobile Number)
- బ్యాంకు ఖాతా వివరాలు (Bank Account Details)
- 16 – 59 ఏళ్ల వయస్సు వారే అర్హులు (16 – 59 Age Group)
పోర్టల్‌లో నమోదు ప్రక్రియ ఇలా..
- https://register.eshram.gov.in/ యూఆర్‌ఎల్‌తో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- ఫోన్ నంబరు నమోదు చేయాలి.
- Enter Captcha అని ఉన్నచోట నంబరు, ఆంగ్ల అక్షరాలను అలాగే పక్కన ఉన్న బాక్సులో నమోదు చేయాలి.
- EPFO మెంబరా అని అడిగిన చోట NO సెలక్ట్ చేయాలి.
- ESIC మెంబరా అని అడిగిన చోట NO సెలక్ట్ చేయాలి
- తర్వాత Send OTP బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఫోన్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి. తర్వాత ఇ-శ్రమ్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
- వ్యక్తిగత, చదువు, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి.
- తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అప్షన్ ఎంచుకోవాలి.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక యూనివర్సల్ అకౌంట్ నంబర్ (Universal Account Number- UAN) కేటాయిస్తారు. కార్మికుడికి జీవితకాలం పాటు ఇదే నంబర్ ఉంటుంది. అలాగే E-Shram Card జారీ చేస్తారు.
చేకూరే ప్రయోజనాలివే..
- ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందుతారు.
ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా రూ. 2 లక్షల పరిహారం అందుతుంది.
పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ. లక్ష పరిహారం అందుతుంది. - గతంలో లేబర్ కార్డు కార్డు ద్వరా అందిన ప్రయోజనాలన్నీ పొందుతారు.
(బీమా, వైద్య ఖర్చులు, ప్రసూతి ఖర్చులు, ఆడపిల్ల పెళ్లికి సాయం, అంత్యక్రియల ఖర్చులు తదితరాలు) - కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పింఛను పథకాల్లో చేరొచ్చు.
- వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం అందించే శిక్షణ పొందొచ్చు.