లక్షదీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ( courtesy: https://www.youtube.com/@NarendraModi )
ఎవరి ఊహకూ అందని విధంగా సర్జికల్ స్ర్కైక్స్ చేయటం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటు. అయితే అది ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఇటీవల లక్షద్వీప్‌లో ప్రధాని చేసిన పర్యటన కూడా అలాంటిదేనని ఆలస్యంగానైనా ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. చైనాను చూసుకుని భారత్ ముందు కుప్పి గంతులు వేస్తున్న మాల్దీవులు దేశ పర్యాటనికి చావుదెబ్బ పడింది. సాహసాలు చేసేందుకు ఇష్టపడేవారు లక్షద్వీప్‌ను ఎంచుకోవాలని ప్రధాని సోషల్ మీడియా వేదికగా చేసిన విజ్ఞప్తి ప్రకంపనలు సృష్టిస్టోంది. ఇది మాల్దీవుల ప్రభుత్వాన్ని, దాని పర్యాటక రంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంటే.. భారత సమాజం మాత్రం మొత్తం మేల్కొంది. సాధారణ ప్రజలే కాదు.. పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, నాయకులు ఇలా.. అందరూ స్పందిస్తున్నారు. లక్షదీప్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఎవరికి వారు ముందుకు వస్తున్నారు. భారత పర్యాటక ప్రేమికులు మాల్దీవులకు చేసుకున్న బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. ఇప్పుడు లక్షద్వీప్ గురించి భారత్‌లోనే కాదు ప్రపంచమంతా ఆన్‌లైన్‌లో వెతుకుతోంది. ఈ నేపథ్యంలో లక్షద్వీప్ చరిత్ర, దాని ప్రత్యేకతలు, అక్కడి అందాలు, సౌకర్యాలు తదితర వివరాలు అందించే ప్రయత్నమే ఈ కథనం.
ఆసక్తికరమైన విషయాలు కొన్ని..
లక్షద్వీప్ అంటే లక్ష దీవులని అర్థం. లక్షద్వీప్ భారత్ కు చెందిన అతిచిన్న కేంద్ర పాలిత ప్రాంతం. దీనికి కరవట్టి రాజధాని. న్యాయవ్యవస్థ పరంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతం కొచ్చిన్‌లోని కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. 32.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న 36 చిన్న దీవుల సమూహజమే లక్షద్వీప్. ఈ ద్వీపాలన్నీ పచ్చ అరేబియా సముద్రంలో కేరళ రాష్ట్రం కొచ్చి తీర నగరానికి 220 నుంచి 440 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే భారతీయులకు కూడా లక్షద్వీప్ అడ్మినిస్ర్టేషన్ నుంచి అనుమతి తీసుకోవటం తప్పనిసరి. విదేశీయులైతే తప్పనిసరిగా వీసా ఉండాలి.
భారత్‌కు అత్యంత కీలక ప్రాంతం..
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్నుడే పాకిస్తాన్ ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందే. లక్షద్వీప్‌లో ఎక్కువ మంది ముస్లింలే ఉండటంతో ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది. దీన్ని ఉక్కు మనిషి, నాటి ఉప ప్రధాని సర్ధార్ వల్లభ్ బాయ్ పటేల్ అడ్డుకున్నారు. భారత్ నేవీని పంపించి లక్షద్వీప్‌లో భారత్ జెండా పాతించారు. అన్ని సంస్థానాల లాగే లక్షద్వీప్‌ను భారత్‌లో అంతర్భాగం చేశారు. భారత్‌కు రక్షణ పరంగా లక్షద్వీప్ ఎంతో కీలక ప్రాంతం. అందుకే భారత ప్రభుత్వం ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్టు ఏర్పాటు చేసింది. ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ నేవల్ బేస్ కూడా ఇక్కడ ఉంది.
పది దీవుల్లోనే జనావాసాలు
లక్షద్వీప్ లో ఒకే జిల్లా ఉంది. పది దీవుల్లోనే జనావాసాలు ఉంటాయి. ఆ పది జనావాసాలే అక్కడి గ్రామ పంచాయతీలు. వాటిలో 2011 లెక్కల ప్రకారం 64,473 జనాభా ఉంది. 96 శాతం ముస్లింలే ఉంటారు. 91.85 శాతం ప్రజలు అక్షరాస్యులే కావటం విశేషం. మలయాళం, దివేహి, జెసేరీ, మహ్ల్ భాషల్లో మాట్లాడుతారు. 17 నిర్జీవ దీవులు ఉన్నాయి. నాలుగు దీవులు కొత్తగా ఏర్పడ్డాయి. ఐదు దీవులు నీట మునిగాయి.
రవాణా సౌకర్యాలు ఇలా..
లక్షద్వీప్‌లో అగట్టి దీవికి మాత్రమే ఎయిర్ పోర్టు సౌకర్యం ఉంది. ఇతర దీవులకు వెళ్లాలంటే పెర్రీ లేదా హెలీ క్యాప్టర్‌ను ఆశ్రయించాల్సిందే. లక్షద్వీప్‌లో ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ పది నివాస దీవులకు, ఎయిర్‌టెల్ కవరత్తి, అగట్టి దీవులకు కనెక్టివిటీని అందిస్తుంది.
సుందర తీరం.. మరచిపోలేని విహారం
లక్షద్వీప్ లో తెల్లటి ఇసుక బీచ్‌లు ఉంటాయి. పడగపు దిబ్బలు ఉన్నాయి. అత్యంత నిర్మలమైన జలాలు, ప్రశాంత వాతావరణానికి లక్షద్వీప్ నెలవు. ఇక్కడ 22 – 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. కరవట్టి, ఆగట్టి, బంగారం, కద్మత్, జెట్టీ సైట్, తిన్నకర, లైట్ హౌస్త, మినీకాయ్, అమిని తదితర ప్రాంతాలు ముఖ్యమైన సందర్శనీయ స్థలాలు. 200 కిలోమీటర్ల వెడల్పైన నైన్ డిగ్రీ కెనాల్ దక్షిణ భాగంలోని మినికాన్ దీవితో ఉన్న దీవులన్నీ పగడపు దీవులతో నిర్మితమైనవే.
విడిది.. విందు ఇలా..
లక్షద్వీప్ లో ఎక్కువగా రిసార్టులను ప్రభుత్వమే నడిపిస్తుంది. ధరలు కాస్త చౌకగానే ఉంటాయని చెప్పొచ్చు. బీచ్‌ల వద్ద భవనాలు, కాటేజ్‌లలో విడిది చేయొచ్చు. ఆగట్టి దీపం బీచ్, బంగారం, కద్మత్ దీపాల్లోని రిసార్టులు చాలా ప్రసిద్ధం. ఎక్కువగా సీఫుడ్, కొబ్బరితో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. దక్షిణ భారత వంటకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గోమాంసంపై ఇక్కడ నిషేధం ఉంది. లక్షద్వీప్‌లో బంగారం దీపంలో తప్ప అంతటా మద్య నిషేధం అమలులో ఉంటుంది.
భిన్న సంస్కృతుల సమ్మేళనం
లక్షద్వీప్ భిన్న సంస్కృతుల సమ్మేళనంగా చూస్తాం. భారతీయ, అరబిక్, ఆఫ్రికా సంప్రదాయాలు ఇక్కడి ప్రజలను ప్రభావితం చేశాయి. ఇక్కడి ప్రజలు తొలుత హిందువులే. 14వ శతాబ్దంలో ఇస్లాములోకి మారారు. ఇక్కడి మసీదుల వాస్తుశిల్పం కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. లావా, కోల్కలి వంటి నృత్యాలు చాలా ప్రసిద్ధం. అన్ని దీవుల్లో ఉన్న వారి జీవనశైలి ఒకటే అయినా భాషలు మాత్రం వేరు. అధికారిక భాష, అనుసంధాన భాష మలయాళమే.
వైవిధ్యమైన జీవావరణం
అనేక రకాల పక్షులకు లక్షద్వీప్ ఆవాసంగా ఉంటోంది. సముద్ర తీర ప్రాంత ప్రాణులు ఎక్కవగా ఉండటం వల్ల సుహేలీ పార్ ప్రాంతాన్ని మేరిస్ నేషనల్ పార్క్ గా ప్రకటించారు. లక్షద్వీప్‌లో పడగపు కొండలు, సముద్రపు అర్చిన్స్, సముద్రపు పాచి, సముద్రపు దోసకాయలు, నక్షత్ర చేపలు, క్లామ్స్, ఆక్టోపస్‌లు ఉంటాయి. సీతకోక లాంటి అనేక చేపలు ఉంటాయి. ట్యూనా, వాహూ, స్వోర్డ్ ఫిష్ (కత్తి చేప), డాల్ఫిన్స్ చాలా ఉంటాయి.