cred-credit-card-payment

CRED : క్రెడిట్ కార్డులు ఎన్నున్నా .. క్రెడ్ యాప్ ఒక్క‌టి చాలు!

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల(Credit Cards) వినియోగం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఒక్కొక్క‌రికి రెండు, మూడు, నాలుగు క్రెడిట్ కార్డులు కూడా ఉంటున్నాయి. ఒక్కో క్రెడిట్ కార్డు లావాదేవీలు చెక్ చేసుకోవ‌డానికి, దాని బిల్ పే(Bill Pay) చేయ‌డానికి ఒక్కో యాప్ వాడాల్సి వ‌స్తోంది. ఏ కార్డులో ఎంత శాతం వాడామో, ఎప్పుడు చెల్లించాలో అని టెన్ష‌న్ ప‌డుతుంటారో క్రెడిట్ కార్డుల వినియోగ‌దారులంద‌రికీ తెలిసిందే. ఈ స‌మస్య ప‌రిష్కారానికి చ‌క్క‌ని ప‌రిష్కార‌ముంది. అదే క్రెడ్(CRED). పేరుకు దీన్ని క్రెడిట్ కార్డుల బిల్ పేమెంట్ యాప్ గా చెప్పినా ఇందులో చాలా ఫీచ‌ర్లు ఉన్నాయి. క్రెడ్(CRED) ఫౌండ‌ర్ కునాల్ షా(Kunal Shah) దీన్ని చాలా తెలివిగా డిజైన్ చేశారు.

క్రెడిట్ కార్డుల స‌మ‌స్త స‌మాచారం..

750 కంటే ఎక్కువ సిబిల్ స్కోరు(CIBIL Score) ఉన్న వారికే ఈ యాప్ ను వినియోగించుకోవ‌చ్చు చెబుతారు. కానీ సిబిల్ స్కోర్ త‌క్కువ‌గా ఉన్న వారు కూడా వినియోగించుకోవ‌చ్చు. ఇందులో వినియోగ‌దారు వాడుతున్న క్రెడిట్ కార్డులకు సంబంధించిన అన్ని వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవ‌చ్చు. కార్డుల వారీగా చేసిన ఖ‌ర్చు, చెల్లించాల్సిన మొత్తం(Due), అన్ బిల్(Unbill) మొత్తం, ఖ‌ర్చు చేసిన శాతం ఇలా అన్ని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల సిబిల్ స్కోర్ ప‌డిపోకుండా కార్డుల వ్య‌యం 30 శాతానికి మించ‌కుండా జాగ్ర‌త్త ప‌డే అవ‌కాశం ఉంటుంది. అన్ని కార్డులు క‌లిపి చేసిన వ్య‌యం, చెల్లించాల్సిన మొత్తం, అన్‌బిల్ మొత్తం వివ‌రాలు కూడా క‌నిపిస్తాయి. దీని వ‌ల్ల ఖర్చు పెరిగి ప‌రిస్థితి చేయిదాటి పోకుండా చూసుకోవ‌చ్చు. అలాగే ఒకే యాప్ నుంచి అన్ని కార్డుల బిల్ పేమెంట్ చేయొచ్చు. బిల్ పే చేసిన ప్ర‌తీసారి(ఒక కార్డుపై నెల‌కు ఒక‌సారి) క్యాష్ బ్యాక్(Cash Back) వ‌స్తుంది. అయితే అది రూ. 3 నుంచి రూ.10 లోపే ఉంటుంది. భారీగా క్యాష్ బ్యాక్‌ వ‌స్తుంద‌ని యాప్‌లో చూపించినా అది నిజం మాత్రం కాదు. వ‌చ్చిన క్యాష్ బ్యాక్ యాప్‌లో బ్యాలెన్స్ గా ఉంటుంది. బ్యాలెన్సు ను క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపున‌కు వాడుకోవ‌చ్చు. ఎన్ని రూపాయ‌లు పే చేస్తే అన్ని క్రెడ్ పాయింట్స్(CRED Coins) జ‌మవుతాయి. ప్ర‌తి నెలా 1వ తేదీన క్రెడిట్ స్కోర్ (సిబిల్ స్కోర్)ను ఉచితంగా చూసుకోవ‌చ్చు.

అద్దె చెల్లించేందుకు త‌క్కువ రుసుం..

క్రెడిట్ కార్డుల‌తో అద్దె(House Rent) చెల్లించే అవ‌కాశం కల్పించాక చాలామంది ఇందుకు వినియోగించుకుంటున్నారు. చాలా యాప్స్ 2 శాతం రుసుం వ‌సూలు చేస్తున్నాయి. క్రెడ్‌లో మిగ‌తా వాటికంటే త‌క్కువ రుసుం ఉంటుంది. ఈ ర‌కంగా అద్దె చెల్లించేందుకు ఇది చక్క‌ని వేదికనే చెప్పాలి. పాఠ‌శాల(school Fee), క‌ళాశాల(College Fee), ట్యూషన్(Tution) ఫీజులు కూడా చెల్లించొచ్చు. మొబైల్‌(Mobile Rechage), డీటీహెచ్‌(DTH) రీఛార్జీ చేసుకోవ‌చ్చు. పోస్ట్ పెయిడ్(PostPaid) ఫోన్‌, కేబుల్ టీవీ(Cable TV), క‌రెంటు బిల్లు(Power Bill)లు చెల్లించొచ్చు. ఫాస్టాగ్(Fastag) లో బ్యాలెన్స్ వేసుకోవ‌చ్చు. వంట గ్యాస్(LPG) బుక్ చేసుకోవ‌చ్చు. ఇన్సూరెన్స్ ప్రీమియం(Insurance Premiuem) చెల్లించొచ్చు. కొన్ని ఫైనాన్స్ సంస్థ‌ల నుంచి తీసుకున్న రుణాల కిస్తులు(EMIs) చెల్లించొచ్చు. గూగుల్ పే, ఫోన్‌పే లాగా ఫోన్ నంబ‌రుతో లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు (UPI payments) కూడా చేయొచ్చు.

షాపింగ్‌, ట్రావెలింగ్ ప్యాకేజీలు..

క్రెడ్‌లో చాలా ర‌కాల వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అయితే మ‌న‌కు కావాల్సిన వ‌స్తువును టైప్ చేసి వెత‌క‌లేము. అందులో డిస్ ప్లే చేసిన వస్తువుల‌న్నీ చూస్తూ వెళ్లాల్సిందే. మ‌న‌కు కావాల్సినవి, న‌చ్చిన‌వి క‌నిపిస్తే ఆర్డ‌ర్ చేయాలి. అలాగే దేశ విదేశాల‌కు సంబంధించిన చాలా ర‌కాల టూర్స్ (Vacations) ప్యాకేజీలు అందుబాటులో ఉండ‌టం విశేషం. ఇందులో గోవా(Goa), ద‌క్షిణ భార‌తదేశం(Southern India), ఉత్త‌ర భార‌తదేశం(Northern India), మ‌ల్దీవులు(Maldives), యూఏఈ(UAE), యూర‌ప్‌(Europe), ట‌ర్కీ(Turkey, ఇత‌ర ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌కు వివిధ ర‌కాల ప్యాకేజీలు ఉంటాయి. వ‌స్తువులను ఆర్డ‌ర్ చేసేందుకు, టూర్ల‌ను బుక్ చేసుకునేందుకు క్రెడ్ కాయిన్స్ (CRED coins)ని వాడుకుంటే కొద్ది మొత్తం ధ‌ర‌లు త‌గ్గుతాయి. ధ‌ర‌లు ఇత‌ర ఈ – కామ‌ (E-Commerce) యాప్‌లో లాగానే ఉంటాయి. అందులో డిస్‌ప్లే వ‌స్తువులు, వాటి కంపెనీలు చాలా వ‌ర‌కు తెలియ‌నివి ఉండ‌టం విశేషం.

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply