alasanda-vadalu

Alasanda Vada : నోరూరించే బొబ్బర్లు / అల‌సంద‌  వడల తయారీ ఇలా..

ఎంతో రుచిగా ఉండే బొబ్బర్లు / అల‌సంద‌  వడలను రాయ‌ల‌సీమ‌, తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు చాలా ఇష్ట‌ప‌డ‌తారు.  ముఖ్యంగా పండుగ‌ల వేళ త‌ప్ప‌నిస‌రిగా చేసుకుంటారు. చాలా టేస్టీగా, కొంచెం కారంగా, మెత్తగా ఎంతో బాగుంటాయి. ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేయమని పిల్లలు అడుగుతారు. అనంత‌పురం వంటి ప‌ట్ట‌ణాల్లో  అల‌సంద వ‌డ‌లు విక్ర‌యించే దుకాణాలు వీధివీధినా ఉంటాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవ‌చ్చు. 

? కావ‌ల‌సిన ప‌దార్థాలు..

 బొబ్బ‌ర్లు  / అల‌సంద‌లు  – అర కిలో, నూనె –  డీప్ ఫ్రైకి స‌రిప‌డినంత‌, ప‌చ్చిమిర్చి – 4, 5 ; స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – త‌గిన‌న్ని, అల్లం – చిన్న‌ముక్క‌, జిల‌క‌ర్ర – ఒక టీ స్పూన్‌, క‌రివేపాకు – కొద్దిగా,  ఉప్పు – త‌గినంత‌, కొత్తిమీర – ఒక క‌ట్ట‌

?త‌యారీ విధానం.. 

బొబ్బ‌ర్ల‌ను ముందుగా నాలుగు, అయిదు గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టాలి. పొట్టు తీసి వేసినా, అలాగే ఉంచినా ప‌ర్వాలేదు.  నాన‌బెట్టుకున్న బొబ్బ‌ర్ల‌లో అల్లంముక్క‌, జిల‌క‌ర్ర‌, ఉప్పు, కొత్తిమీర‌, ప‌చ్చిమిర్చి వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా రుబ్బుకోవాలి. నీళ్లు ఎక్కువ‌గా వేయొద్దు.  అలా చేస్తే నూనెలో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. రుబ్బుకున్న మిశ్ర‌మంలో క‌రివేపాకు కొద్దిగా వేసి బాగా క‌లిసేలా క‌లుపుకోవాలి.  రుచికి స‌రిప‌డా ఉప్పు, కారం ఉందో లేదో చూసుకోవాలి. ఉప్పు త‌క్కువ‌గా ఉంటే క‌లుపుకోవాలి. మిశ్ర‌మాన్నంతా బాగా క‌లుపుకొని మూకుడు(బాండి)లో నూనె పోసి వేడి చేయాలి.  పిండిని కొంచెం, కొంచెంగా తీసుకుని పాల క‌వ‌రుపై గారెలాగా ఒత్తి కాగిన నూనెలో వేసి ఎర్ర‌గా  కాల్చుకోవాలి. నోనూరూరించే వ‌డ‌లు రెడీ అవుతాయి. వీటికి చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌ల కూరలు జ‌త‌క‌లిస్తే ఆ రుచే వేరు.

? ల‌భించే  పోష‌కాలు ఇలా.. 

( ప్ర‌తి 100 గ్రాముల అల‌సంద‌ల్లో )

కార్బోహైడ్రేట్స్    54 గ్రాములు

ప్రొటీన్స్             24 గ్రాములు

ఫ్యాట్                  1 గ్రాము

కేల‌రీస్                323 

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply