ఆధార్ నిజంగానే మనం దేశంలో అన్నింటికి ఆధారంగా మారింది. చిన్నారులకు టీకా వేయాలన్నా, అంగన్‌వాడీ కేంద్రంలో లేదా పాఠశాలలలో చేర్పించాలన్నా, ఉపకార వేతనం అందాలన్నా, సంక్షేమ పథకాల ఫలాలు పొందాలన్నా, వివాహం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇలా అడుగడుగునా అడిగేది ఆధార్. అందుకే అందులో వివరాలు అన్నీ సక్రమంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఫోన్ నంబరు మారినా, చిరునామా మారినా వెంటనే ఆ వివరాలను ఆధార్ నవీకరణ (Aadhaar Update) చేసుకోవాలి. పిల్లలు అయిదేళ్లు దాటినా, 15 ఏళ్లు దాటినా వారి ఆధార్‌లో ఫొటో మార్చి నవీకరణ చేసుకోవాలి. పదేళ్లకోసారి ఆధార్ నవీకరణ చేసుకుంటే ఇంకా మంచిది. అదెలాగో చూడండి.
- ఆధార్ అప్‌డేట్ చేసుకోవటం ఇలా..
- ఏదైనా సెర్చ్ ఇంజిన్ (గూగుల్)లో https://uidai.gov.in/ వెబ్‌పేజీని ఓపెన్ చేయాలి.
- పలు జాతీయ భాషలు కనిపిస్తాయి.
- వివరాలు తెలుగులో కావాలంటే తెలుగు లేదంటే English ఎంచుకోవాలి.
- ఆధార్ అపడేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అక్కడ కనిపించే Update Demographics Data & Check Status అనే దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత వచ్చే పేజీ(https://myaadhaar.uidai.gov.in/)లో కనిపించే Login బటన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత వచ్చే పేజీలో ఆధార్ నంబర్, అక్కడ కనిపించే క్యాప్చా కోడ్ ను కింద నమోదు చేయాలి.
- ఆధార్‌తో అనుసంధానం ఉన్న ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
- 6 అంకెల ఓటీపీని నమోదు చేయాలి.
- తర్వాత ఆధార్ అప్‌డేట్ (Aadhaar Update) ఆప్షన్ ఎంచుకోవాలి.
- ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత వచ్చే పేజీలో అడ్రస్ ఆప్షన్ ఎంచుకుని ప్రొసీడ్ టు అపడేట్ ఆధార్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- పేజీలో కార్డులోని ప్రస్తుత అడ్రస్ కనిపిస్తుంది. కింద మార్చాల్సిన చిరునామా నమోదు చేయాలి.
- ఇంధుకు ఆధారంగా ఉన్న ఏదైనా ఒక ధ్రువీకరణ పత్రం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- తర్వాత Next పై క్లిక్ చేసిన సబ్మిట్ చేయాలి.
- ఆధార్ అనుసంధానమైన ఫోనుకు ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీ నమోదు చేసి నిర్దిష్టమైన రూ. 50 ఫీజు చెల్లించాలి.
- దీంతో ఆధార్ చిరునామా అప్‌డేట్ ప్రక్రియ ముగిసినట్లే.
- ఆధార్‌లో మార్పులను ప్రివ్యూగా కూడా చూడొచ్చు.
- ఆ తర్వాత URN నంబరు వస్తుంది. దాని ద్వారా అప్‌డేట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
- ఒకటి నుంచి మూడు వారాల్లో ఆధార్ అప్‌డేట్ పూర్తవుతుంది.
- ఆ తర్వాత కొత్త ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.