ఈ రోజు క్రెడిట్ కార్డుల (Credit Cards) వినియోగం తప్పనిసరిగా మారింది. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో.. ఎప్పుడు అనుకోని ఖర్చు మీద పడుతుందో తెలియదు. . అవసరానికి ఎవరు డబ్బిస్తారు.. ఆడగాలంటే మొహమాటం.. ఒకవేళ అడిగితే ఇవ్వకపోతే ఎంతో అవమానకరంగా భావిస్తాం.. ఇలాంటి పరిస్థితులు అందరికీ అనుభవమే. . ఈ సమస్యలకు పరిష్కారమే క్రెడిట్ కార్డులు..
రిజర్వ్ మనీలా..
చాలా మంది ఆర్థిక నిపుణులు ఉద్యోగం పోయినా, ఏదైనా ఆపద వచ్చినా, ఆదాయం దూరమైనా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి (Reserve Money) ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తుంటారు. . రకరకాల కారణాలు, అవసరాలతో చాలామంది రిజర్వ్ మనీ ఏర్పాటు చేసుకోలేరు.. అలాంటి పరిస్థితిలో ఒక నెల నుంచి 45 రోజుల వరకు అవసరాలు తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా హాస్పిటల్ ఖర్చులకు బాగా ఉపయోగడపడతాయి.
క్రెడిట్ హిస్టరీ..
బ్యాంకుల్లో రుణాలు పుట్టాలంటే క్రెడిట్ హిస్టరీ(Credit History) కీలకం. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే బ్యాంకర్లు సిబిల్ స్కోర్ (Cibil Score)ఎంత ఉందో ఆరాతీస్తుంది. సిబిల్ స్కోర్ 700లకు పైగా ఉంటేనే రుణాలు లభిస్తాయి. రుణ చరిత్ర (క్రెడిట్ హిస్టరీ) ఉన్నవారికే సిబిల్ స్కోర్ బాగుంటుంది. రుణం కూడా ఎక్కువ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. క్రెడిట్ హిస్టరీ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచింది.
బోనస్ పాయింట్లు
క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తూ చెల్లింపులు చేస్తే బోనస్ పాయింట్లు(Bonus Points) వస్తాయి. ఒక్కో సంస్థ ఒక్కో విధంగా బోనస్ పాయింట్లు ఇస్తాయి. నాలుగు బోనస్ పాయింట్లు ఒక రూపాయికి సమానం.. 4వేల బోనస్ పాయింట్లు జమ కాగానే రెడీమ్చే(Bonus Points) సుకుంటే రూ.1000 అవుతాయి. వాటిని వినియోగించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర వంటి వాటిలో వస్తువులు కొనుగోలు చేయొచ్చు.
క్యాష్ బ్యాక్..
క్రెడిట్ కార్డుల్లో మరో గొప్ప ప్రయోజనం ఏంటంటే క్యాష్‌బ్యాక్(Cash Back). ఒక్కో సంస్థ ఒక్కోవిధంగా క్యాష్ బ్యాక్ అందిస్తుంది. క్రెడిట్ కార్డుతో రూ.100 వెచ్చిస్తే సంస్థను బట్టి రూ.1 నుంచి రూ.2 వరకు క్యాష్‌బ్యాక్‌గా అందుతుంది. ఈ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులో లేదా అనుబంధ యాప్‌లో జమ అవుతుంది. బిల్లుల చెల్లింపు, వస్తువుల కొనుగోలుకు వినియోగించుకోవచ్చు.
కోబ్రాండెట్ కార్డులు
అమెజాన్, ప్లిప్‌కార్ట్, పేటీఎం వంటి అనేక సంస్థలు కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులు(Co-branded Credit Cards) అందిస్తున్నాయి. వీటిని ఉపయోగిస్తూ ఆయా యాప్‌లలో చెల్లింపులు చేసినా, వస్తువులు కొనుగోలు చేసినా 5% వరకు ధర తగ్గుతుంది. దీనిపై క్యాష్ బ్యాక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఏయే అవసరాలకు కార్డు వాడుతామో గుర్తించి సంబంధిత రంగ సంస్థ కోబ్రాండెడ్ కార్డులు తీసుకోవాలి.
వడ్డీలేని అప్పు
క్రెడిట్ కార్డు చేతిలో ఉంటే మన వద్ద వడ్డీ లేని అప్పు (Loan Without Interest) పొందినట్లే. క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్ (Credit LImit) రూ.లక్ష ఉంటే అంత మొత్తాన్ని వివిధ అవసరాలకు వినియోగించుకోవచ్చు. కార్డు బిల్ సైకిల్(Credit Card Bill Cycle) మొదటి రోజు ఏదైనా అవసరానికి వినియోగిస్తే 45 రోజుల(Forty Five Days) వరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. సొంత డబ్బు రూ.లక్ష బ్యాంకులో ఉంటే వడ్డీ కూడా వస్తుంది.