beans-curry-cooking

Beans Curry : ఆరోగ్య‌క‌ర‌మైన బీన్స్ కూర ఇలా వండితే రుచి అద్భుతంగా ఉంటుంది.. 

స్థూల‌కాయం, మ‌ధుమేహం బాధితులు పెరుగుతున్న నేప‌థ్యంలో కిటో డైట్(Keto Deit) కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ముఖ్యంగా పిండి ప‌దార్థాలు (Carbohydrates) ఎక్కువ‌గా తీసుకోవ‌డ‌మే ప్రమాద‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ఎంత త‌క్కువ కార్బోహైడ్రైట్లు ఉన్న ఆహారం తీసుకుంటే అంత మంచిద‌న్న భావ‌న నెల‌కొంది. అందుకే కార్బోహైడ్రేట్లు త‌క్కువ‌గా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. అలాంటి కూర‌గాయ‌ల్లో బీన్స్ (French Beans) కూడా ఒక‌టి.  స‌రిగ్గా వండ‌టం వ‌స్తే ఈ కూర చాలా రుచిగా కూడా ఉంటుంది.  అదెలా చేసుకోవాలో చూద్దాం. 

బీన్స్ కూర కి కావాల్సిన పదార్థాలు

బీన్స్(Beans)
అర కిలో
ఉల్లిపాయ ముక్కలు   (Onions) 
కొన్ని
పచ్చి మిర్చి  (Green Chilli)        ఐదు
వెల్లుల్లి పాయ‌లు (Garlic)           
నాలుగు
కరివేపాకు రెబ్బలు  (Curry Leaves)       
రెండు
టమాట (Tomato)             
ఒక‌టి
ఉప్పు  (Salt)                         
తగినంత
కారంపొడి  (Red Chilli Powder)        తగినంత
గరం మసాలా  (Garam Masla)           
ఒక‌ స్పూన్ 
ధనియాల పొడి  (Coriander Powder)             
ఒక స్పూన్
నువ్వుల పొడి   (Seasame Powder )       రెండు స్పూన్లు

కూర వండే విధానం.. 

ముందుగా గిన్నె స్టౌవ్‌పై పెట్టి మూడు స్పూన్ల‌ నూనె ని పోయాలి.  నూనె వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక అందులో కరివేపాకు వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లిని కచ్చప‌చ్చ‌గా దంచి వేసుకోవాలి, వాటన్నింటిని బాగా వేయించాలి. త‌ర్వాత అందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. అందులో  బీన్స్ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి.  ఉప్పుకారం బీన్స్ ముక్కలకు బాగా ప‌ట్టేవ‌ర‌కు వేపుకోవాలి. అవి కొద్దిగా వేగాక అందులో ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. అలా వేడిచేస్తూ ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు గిన్నెపై మూత పెట్టాలి.  త‌ర్వాత నువ్వుల పొడి వేసి క‌ల‌పాలి. ఆ త‌ర్వాత నువ్వ‌ల పొడి వేసి అందులో  కొంత నీరు పోసి మ‌ళ్లీ మూత‌పెట్టి ఉడ‌క‌బెట్టాలి.  చాలామంది చేసే పొర‌పాటు ఏంటంటే ప్రతీ కూర‌లో ఆవాలు, జీల‌క‌ర్ర వేయ‌టం. ఈ కూర‌లో ఆ రెండు వేయ‌క‌పోతేనే రుచిక‌రంగా ఉంటుంది. ఇక వడ్డించుకోవడమే తరువాయి.


బీన్స్ లో ఉండే పోష‌క విలువ‌లు 

పిండి ప‌దార్థాలు (Carbohydrates) 
 4 గ్రాములు
పీచు ప‌దార్థం (Fiber)                  4 గ్రాములు 
మాంస‌కృత్తులు (Proteins)           
 2 గ్రాములు 
కొవ్వు ప‌దార్థాలు (Fat)               
 0 గ్రాములు 
కాల‌రీలు  (Calories)                 26 
పాస్ప‌ర‌స్   (Phosphorus)             
28 మిల్లీ గ్రాములు 
కాల్షియం  (Calcium)                   50 మిల్లీ గ్రాములు 
ఐర‌న్ (Iron)                                  ఒక గ్రాము 
షేర్ చేయండి. telugu spiritని చాటండి