ప్రభాస్, వంగా సందీప్‌రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న హై యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ ఐపీఎస్ అధికారిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ప్రముఖ కొరియన్ నటుడు డాన్ లీ (Ma Dong – Seok) ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లు కొరియన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి కథనాయికగా నటిస్తోంది. తొలుత ఈ చిత్రానికి దీపికా పదుకొన్‌ను హీరోయిన్‌గా అనుకున్నా దర్శకుడికి, ఆమెకు వచ్చిన విభేదాలతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకొంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉండొచ్చనే హాగానాలు కొనసాగుతున్నాయి. సందీప్‌రెడ్డి వంగా ఇదివరకు తీసిన చిత్రాలు చాలా బోల్డ్‌గా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా ‘యానిమల్’ చిత్రంలో బోల్డ్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. ప్రభాస్‌ను కూడా ఇలాంటి సీన్స్‌లో చూస్తామా అన్న ఉత్కంఠ ఆయన అభిమానుల్లో ఉంది. చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. 2026లో చిత్రం చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందుతుండటం విశేషం. ప్రభాస్ పాత్ర చుట్టూ ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను కొనసాగించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
